తదుపరి వార్తా కథనం

దేశంలో కొత్తగా 9,355 మందికి కరోనా; 26 మరణాలు
వ్రాసిన వారు
Stalin
Apr 27, 2023
11:22 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో గత 24గంటల్లో 9,355 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అలాగే కరోనా కారణంగా మరో 26మంది మృతి చెందినట్లు కేంద్రం పేర్కొంది.
తాజా కేసులతో కలిపి మొత్తం కోవిడ్ యాక్టివ్ కేసులు 57,410కి చేరుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
కొత్త మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5,31,424కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా నమోదైంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరుకున్నట్లు కేంద్రం పేర్కొంది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.13 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) April 27, 2023
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/HLoQCgsCV0 pic.twitter.com/I7KW2Tm8xO