Nellore Mayor: నెల్లూరు మేయర్ స్రవంతిపై అవినీతి ఆరోపణలు.. త్వరలో అవిశ్వాస తీర్మానం?
ఈ వార్తాకథనం ఏంటి
నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై త్వరలోనే అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేయర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన 40 మంది కార్పొరేటర్లు మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. మేయర్ స్రవంతి దంపతులు నగర అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారని, వారి అవినీతితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వారు వివరించారు. మేయర్ దంపతుల జోక్యంతో దస్త్రాలు కదలడం లేదని, పరిపాలన పూర్తిగా స్థబ్దతకు గురవుతోందని కార్పొరేటర్లు వాపోయారు.
Details
కొత్త మేయర్ కోసం డిమాండ్
ఈ పరిస్థితుల్లో కొత్త మేయర్‌ను నియమించాల్సిందిగా డిమాండ్ చేశారు. కార్పొరేటర్ల అభ్యర్థనకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా ఏకీభవించినట్లు సమాచారం. ఈ పరిణామాల నడుమ, టీడీపీ త్వరలోనే మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఫోర్జరీ సంతకాల కేసులో ఇటీవల మేయర్ భర్త జయవర్ధన్ జైలు శిక్ష అనుభవించి వచ్చిన విషయం తెలిసిందే.