Page Loader
Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం
సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం

Cultivation of vegetables: సర్కారు బడిలో కూరగాయల సాగు.. భోజనంతో పాటు విద్యా వికాసం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ సమస్య లేదు. ఈ పాఠశాల విద్యార్థులు మూడేళ్లుగా తమ పాఠశాల వద్ద సొంతంగా కూరగాయలను సాగిస్తూ, ఈ కూరగాయలు మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నారు. దీంతో పలువురికి ఆదర్శంగా నిలిచారు. టమాట, వంకాయ, అలసంద (బొబ్బర), ఆకుకూరలు వంటి కూరగాయలు సాగించి, పాఠశాలకు అవసరమైన కూరగాయలు సరఫరా చేస్తున్నారు. ఇంకా మిగిలిన కూరగాయలు పక్క పాఠశాలలకు పంపిస్తారు. ఈ సాగును పాఠశాల అటెండర్‌ పర్యవేక్షిస్తున్నారు. దీనికి కలెక్టర్‌ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు.