Lok Sabha Elections Date: నేడే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
భారత ఎన్నికల సంఘం శనివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‍ను ప్రకటించనుంది. దీంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రానుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్‌కు అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 2019 ఎన్నికల మాదిరిగానే 2024 సార్వత్రిక ఎన్నికలను కూడా ఏడు లేదా ఎనిమిది దశల్లో నిర్వహించవచ్చు. 2019 ఎన్నికలు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఒకరోజు తర్వాత షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించేందుకు సిద్ధమైంది.
ఈసారి ఓటు వేయనున్న 97 కోట్ల మంది ఓటర్లు
2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను తేదీని మార్చి 10న ప్రకటించారు. గతసారి ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 67.1 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఓట్ల లెక్కింపు మే 23న జరిగింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో 97 కోట్ల మంది ఓటు వేయనున్నారు. ఎన్నికల్లో అవకతవకలను అరికట్టేందుకు ఈసారి అనేక చర్యలు తీసుకుంటామని ఈసీ పేర్కొంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 303 సీట్లలో విజయం సాధించి, లోక్‌సభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.