
Telangana : గుండెపోటుతో తండ్రి మృతి.. అంత్యక్రియలు చేసిన కూతుళ్లు!
ఈ వార్తాకథనం ఏంటి
హిందూ సంప్రదాయాల ప్రకారం తండ్రి మరణించినా, తల్లి మరణించినా, కొడుకులు తలకొరివి పెడతారు. ఇదే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది.
అయితే తండ్రి గుండెపోటుతో మరణించడంతో నలుగురు కూతుళ్లు కొడుకులుగా మారి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు మండలం రాజుపేటలో చోటు చేసుకుంది.
మణుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉన్న నరసింహారావు-గోపమ్మ దంపతులకు ఆరుగురు సంతానం.
వీరిలో ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి.
నరసింహారావు సింగరేణి విశ్రాంతి ఉద్యోగి. అయితే రెండేళ్ల క్రితం ఈతకెళ్లి కుమారుడు గోదావరిలో పడి చనిపోయాడు.
అప్పటి నుంచి అమ్మనాన్నల బాధ్యత కూతుళ్లే చూసుకుంటున్నారు.
Details
తలకొరివి పెట్టిన పెద్ద కుమార్తె
ఈ క్రమంలో నరసింహారావు నిన్న తెల్లవారుజామున గుండెనొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే నరసింహారావు మృతి చెందారు. ఇక ఇంట్లో మగవాళ్ళు లేకపోయే సరికి అన్ని తామై తమ తండ్రి అంత్యక్రియలను కూతుళ్లు దగ్గరుండి నిర్వహించారు.
పెద్ద కుమార్తె తలకొరివి పెట్టగా, మిగిలిన నలుగురు కూతుళ్లు పాడే మోస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు.