కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ
నైరుతి రుతుపవనాలు ఈ సారి ఆలస్యంగా కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ మంగళవారం తెలిపింది. జూన్ 4న రుతుపవనాలు కేరళకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. సాధరణంగా రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత కేరళ మీదుగా దేశమంతా వ్యాపిస్తాయి. తద్వారా వర్షాలు కురుస్తాయి. కింది ఆరు మోడళ్లతో వర్షాల రాకను ఐఎండీ అంచనా వేస్తుంది. 1.వాయువ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు. 2.దక్షిణ ద్వీపకల్పంలో రుతుపవనానికి ముందు వర్షపాతం. 3.దక్షిణ చైనా సముద్రంపై అవుట్‌గోయింగ్ లాంగ్‌వేవ్ రేడియేషన్. 4.ఆగ్నేయ హిందూ మహాసముద్రంపై దిగువ ట్రోపోస్పిరిక్ జోనల్ గాలి. 5.ఉపఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంపై సగటు సముద్ర మట్టం పీడనం. 6.ఈశాన్య హిందూ మహాసముద్రంపై ఎగువ ట్రోపోస్పిరిక్ జోనల్ గాలి
ఐదు రోజుల్లో ఈశాన్య భారతదేశంలో తేలికపాటి వర్షాలు
గత సంవత్సరం ఐఎండీ అంచనా వేసిన తేదీ కంటే రెండు రోజుల తర్వాత కేరళకు నైరుతి రుతుపవనాలు వచ్చాయి. గత 18 సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాల రాక 2015లో మినహా అన్ని సందర్భాల్లో ఐఎండీ అంచనాలు నిజయమయ్యాయి. రాబోయే ఐదు రోజులలో ఈశాన్య భారతదేశంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కురుస్తుందని ఐఎండీ చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 16, 19, 20 తేదీల్లో, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో మే 16 నుంచి 20 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.