SBI: మూకుమ్ముడి లంచ్ విరామానికి SBI సిబ్బంది.. సోషల్ మీడియాలో పోస్ట్.. స్పందించిన SBI
సేవా సమస్యలకు సంబంధించి భారతీయ బ్యాంకులు తరచుగా కస్టమర్ల నుండి విమర్శలను ఎదుర్కొంటాయి. ఇటీవల రాజస్థాన్‌లోని పాలిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్ దృష్టిని ఆకర్షించింది. ఒక కస్టమర్ మొత్తం సిబ్బంది ఒకేసారి 3 గంటలకు భోజన విరామానికి వెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఖాళీగా ఉన్న బ్రాంచ్ ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో పోస్ట్
ఖాతాదారుడు Xపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, ఖాళీగా ఉన్న బ్రాంచ్ ఫోటోగ్రాఫ్‌ను పంచుకున్నాడు సామాజిక మాధ్యమం Xలో పంచుకున్నాడు. వ్యంగ్యాన్ని హైలైట్ చేశాడు. దీనిపై SBI స్పందించింది. తమకు నిర్ధిష్ట భోజన సమయాలు లేవని పేర్కొంది. బ్యాంక్ వెంటనే స్పందించి, అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. అయితే బ్రాంచ్ లోపల ఫోటోలు తీయడం భద్రతా నిబంధనలకు విరుద్ధమని కస్టమర్‌కు గుర్తు చేసింది .ఫోటోను తీసివేయమని కోరింది.