Delhi Airport: కేంద్రంపై దిల్లీ విమానాశ్రయం దావా.. హిండన్ ఎయిర్‌బేస్ వివాదం!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ విమానాశ్రయం (Delhi Airport) కేంద్ర ప్రభుత్వంపై చట్టపరమైన పోరుకు దిగింది.
రక్షణ శాఖ పరిధిలోని గాజియాబాద్ హిండన్ ఎయిర్‌బేస్‌కు వాణిజ్య విమానాలకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జీఎంఆర్ (GMR) సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
గాజియాబాద్ విమానాశ్రయం ద్వారా వాణిజ్య విమానాలను అనుమతించడం వల్ల దిల్లీ విమానాశ్రయం ఆర్థికంగా భారీ నష్టాలను ఎదుర్కొంటుందని ఆరోపిస్తూ, మార్చి 10న ఈ దావా దాఖలు చేసినట్లు సమాచారం.
జీఎంఆర్ తన పిటిషన్‌లో, ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు రెండు విమానాశ్రయాల మధ్య కనీసం 150 కి.మీ. దూరం ఉండాలనే నిబంధనను ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంది.
Details
వాణిజ్య సర్వీసులను వెనక్కి తీసుకోవాలి
దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 30 కి.మీ. దూరంలో ఉన్న హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వాణిజ్య విమాన సర్వీసులు నిర్వహించడాన్ని వెనక్కి తీసుకోవాలని కోర్టును కోరింది.
దిల్లీ ఎయిర్‌పోర్ట్ ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాల్లో ఒకటి. 2023లో దాదాపు 73.6 మిలియన్ల మంది ప్రయాణికులు దీన్ని ఉపయోగించగా, ప్రభుత్వ రుసుముల పెరుగుదల కారణంగా దాదాపు 21 మిలియన్ డాలర్ల మేర నష్టాలను చవిచూసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా జీఎంఆర్‌లో మెజారిటీ వాటా కలిగిన దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల సంస్థ ఈ విషయంపై తుది నిర్ణయం కోసం భారత విమానయాన మంత్రిత్వ శాఖ స్పందన కోసం వేచిచూస్తోంది.