NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు
    భారతదేశం

    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు

    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు
    వ్రాసిన వారు Naveen Stalin
    May 27, 2023, 10:52 am 0 నిమి చదవండి
    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు
    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు

    దిల్లీలో శనివారం ఉదయం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్ష కురిసింది. రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. మే 30వ తేదీ వరకు దిల్లీలో వేడిగాలులు ఉండవని ఐఎండీ తెలిపింది. ఈ వర్షాల వల్ల ఉత్తర భారతదేశంలో ఉన్న వేడి వాతావరణ పరిస్థితుల నుంచి ప్రజలు ఉపశమనం పొందుతారని ఐఎండీ పేర్కొంది. దిల్లీలో శనివారం కనిష్ట ఉష్ణోగ్రతలు 19.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని, ఇది సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువ అని ఐఎండీ వెల్లడించింది.

    విమాన సర్వీసులపై ప్రభావం

    దిల్లీ రాజధానిలో ఉదయం 8.30 గంటల వరకు 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా దిల్లీలోని పరిసర ప్రాంతాల్లో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయని దిల్లీ విమానాశ్రయం తెలిపింది. విమాన సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించింది. దిల్లీలో వాతావరణ పరిస్థితుల కారణంగా నాలుగు రాజధానికి రావాల్సిన విమానాలను జైపూర్‌కు మళ్లించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. భారీ వర్షాల కారణంగా మొత్తం ఆరు విమానాలను దారి మళ్లించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    దిల్లీ
    విమానం
    విమానాశ్రయం
    ఐఎండీ

    తాజా

    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్  ఉత్తర్‌ప్రదేశ్
    ఆరోగ్యం: వేసవిలో పిల్లలను హైడ్రేట్ గా ఉంచాలంటే ఎలాంటి ఆహారాలను అందించాలో తెలుసుకోండి  వేసవి కాలం
    బాలయ్య 108వ సినిమా టైటిల్ లీక్: ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి  తెలుగు సినిమా
    ఎంఎస్ ధోని మార్కు అంటే ఇదే.. వారిని ఆడించి విజేతగా నిలిపాడు ఎంఎస్ ధోని

    దిల్లీ

    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? నరేంద్ర మోదీ
    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    దిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేడయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా‌  మనీష్ సిసోడియా

    విమానం

    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ  ఎయిర్ ఇండియా
    'గో ఫస్ట్' విమాన సర్వీసుల రద్దు మే 26 వరకు పొడిగింపు తాజా వార్తలు
    గో ఫస్ట్ విమానాల కోసం లీజుదార్లతో టాటా, ఇండిగో విడివిడిగా చర్చలు టాటా
    పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా?  ఇండియా లేటెస్ట్ న్యూస్

    విమానాశ్రయం

    హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం  హైదరాబాద్
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్  విజయనగరం
    లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాబ్

    ఐఎండీ

    తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు  తెలంగాణ
    ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు తాజా వార్తలు
    దిల్లీలో 46 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు; ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరిక దిల్లీ
    ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు తెలంగాణ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023