దిల్లీ మద్యం కేసు: సిసోడియా అరెస్టుపై ఆప్ నిరసనలు; బీజేపీ హెడ్ క్వార్టర్ వద్ద హై టెన్షన్
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే సిసోడియా అరెస్టు అక్రమమంటూ దేశవ్యాప్తంగా నిరసనలకు ఆప్ సోమవారం పిలుపునిచ్చింది. బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట కూడా ఆప్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు సిద్ధం కావడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆప్ నిరసనల నేపథ్యంలో ఉదయం నుంచే దిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. డీడీయూ మార్గ్ స్ట్రెచ్‌లోనే ఆప్, బీజేపీ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ మార్గంలో పోలీసులు ఆంక్షలను విధించారు.
గతేడాది కూడా మనీలాండరింగ్ ఆరోపణలతో సిసోడియా అరెస్టు
దిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణ సమయంలో సిసోడియా తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని, విచారణకు సహకరించలేదని సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. అందుకే ఆయన్ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది కూడా మనీలాండరింగ్ ఆరోపణలతో సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది. ఆ సమయంలో దాదాపు 9నెలలు ఆయన తీహార్ జైలులు ఉన్నారు. ఆదివారం రాత్రి సిసోడియా అరెస్టు అనంతరం కూడా సీబీఐ ఆఫీస్ వద్దు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సీబీఐ కార్యాలయం వద్ద ఎంపీ సంజయ్ సింగ్, మంత్రి గోపాల్ రాయ్, పలువురు కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సోమవారాన్ని 'బ్లాక్ డే'గా గుర్తించాలని ఆప్ పిలుపునిచ్చింది.