
దిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఆప్ కీలక నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసింది. ఉదయం నుంచి తొమ్మిది గంటలకు పైగా మనీష్ సిసోడియాను సీబీఐ విచారించింది. అనంతరం అదుపులోకి తీసుకుంది.
అయితే సీబీఐ తనను అరెస్టు చేస్తుందని విచారణకు వెళ్లే ముందే ఊహించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ట్వీట్ కూడా చేశారు. తనను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని, ఏడెనిమిది నెలల జైలు శిక్ష అనుభవించేందుకు భయపడనని చెప్పారు.
సిసోడియా సారథ్యంలో దిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతి జరిగినట్లు ఈడీ, సీబీఐ అభియోగాలు మోపాయి.
దిల్లీ
బీజేపీవి టర్టీ పాలిటిక్స్ : కేజ్రీవాల్
దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టుపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిసోడియా అమాయకుడని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు. డర్టీ పాలిటిక్స్ వల్లే సిసోడియా అరెస్టు జరిగినట్లు వెల్లడించారు.
అలాగే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సిసోడియా అరెస్టును ఖండించారు. ప్రధాని మోదీని దేవుడు కూడా క్షమించడని అన్నారు.
మిగతా ఆప్ నేతలు కూడా బీజేపీ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. అలాగే బీజేపీ నాయకులు కూడా అదేస్థాయిలో ధీటుగా సమాధానం చెప్పారు.