DGCA: ఇండిగో సంక్షోభం వేళ.. నలుగురు అధికారులపై డీజీసీఏ వేటు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో సంక్షోభంపై (IndiGo Crisis) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు వేగం పెంచింది. ఈ పరిణామాల్లో భాగంగా, నాలుగు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్లు తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు పలు మీడియా సంస్థల్లో బయటకు వస్తున్నాయి. ప్రాథమిక విచారణలో, పర్యవేక్షణలో జరిగిన ముఖ్యమైన లోపాలే ఇండిగోలో ఏర్పడ్డ తాజా సంక్షోభానికి కారణమని గుర్తించినట్లు తెలుస్తోంది. విమానాల భద్రత, కార్యకలాపాల పరిశీలన బాధ్యతలు వహించే ఈ నలుగురు అధికారులు తమ డ్యూటీలో నిర్లక్ష్యం ప్రదర్శించారని, అందువల్లే వారిపై ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నలుగురు అధికారులపై డీజీసీఏ వేటు..!
IndiGo chaos: 4 flight operation inspectors sacked. @tweettokarishma with more details.#Airlines #IndiGoChaos #India @snehamordani pic.twitter.com/lgmacZ1X0A
— IndiaToday (@IndiaToday) December 12, 2025