LOADING...
Nana Patole: రాజీనామా చేయలేదు.. ఆ వార్తలన్నీ అబద్దం : నానా పటోలే
రాజీనామా చేయలేదు.. ఆ వార్తలన్నీ అబద్దం : నానా పటోలే

Nana Patole: రాజీనామా చేయలేదు.. ఆ వార్తలన్నీ అబద్దం : నానా పటోలే

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 25, 2024
06:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి నిరాశ కలిగించాయి. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే రాజీనామా చేసినట్లు కొన్ని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఖండించారు. తాను రాజీనామా చేయలేదని, మహా వికాస్ అఘాడీ కూటమి అవినీతి లేకుండా కొనసాగుతుందని నానా పటోలే స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా, మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అందులోని ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 51 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ ఈ కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేయగా, 16 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.

Details

2021లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు

మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్‌ పార్టీ ఈసారి పరాజయాన్ని చవి చూసింది. 2021లో నానా పటోలే మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ 17 లోక్‌సభ స్థానాల పోటీ చేస్తే 13 స్థానాలు గెలుచుకుని మంచి ప్రదర్శన అందించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నానా పటోలే సాకొలీ నుండి 208 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.