Raptadu Attack Case: రాప్తాడు ఘటన.. హేమంత్ కుడి కాలు తొలగించిన వైద్యులు
ఈ వార్తాకథనం ఏంటి
అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శస్త్రచికిత్స నిర్వహించి, మోకాలి పైభాగం వరకు కాలును తొలగించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి తెలిపారు. ఎడమ కాలికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతినడంతో ఆ కాలికి కూడా శస్త్రచికిత్స చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హేమంత్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి అత్యవసర వైద్య చికిత్స విభాగం (ఏఎంసీ)కి తరలించి చికిత్స కొనసాగిస్తున్నట్లు మల్లీశ్వరి చెప్పారు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వివరించారు.
వివరాలు
ఆత్మకూరు అడవిలోకి హేమంత్
గోపికపై దాడి చేసిన అనంతరం హేమంత్ ఆత్మకూరు అడవిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల బృందంపై నిందితుడు దాడికి యత్నించడంతో సీఐ వెంకటేశ్ గాల్లోకి కాల్పులు జరిపారు.
అయినా హేమంత్ ఎదురుదాడికి దిగడంతో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారు.
తీవ్రంగా గాయపడిన అతడిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హేమంత్ కుడి కాలుకు రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోవడంతో ఆ భాగం కుళ్లిపోయిందని వైద్యులు తెలిపారు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మోకాలి పైవరకు కాలును తొలగించినట్లు వెల్లడించారు.