LOADING...
Emergency Alert: ఎమర్జెన్సీ అలర్ట్‌తో కలవరపడొద్దు.. ఇది కేవలం టెస్ట్ మాత్రమే
ఎమర్జెన్సీ అలర్ట్‌తో కలవరపడొద్దు.. ఇది కేవలం టెస్ట్ మాత్రమే

Emergency Alert: ఎమర్జెన్సీ అలర్ట్‌తో కలవరపడొద్దు.. ఇది కేవలం టెస్ట్ మాత్రమే

వ్రాసిన వారు Jayachandra Akuri
May 02, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

మీ స్మార్ట్‌ఫోన్‌ ఒక్కసారిగా బీప్‌ శబ్దంతో పాటు 'ఎమర్జెన్సీ అలర్ట్‌' నోటిఫికేషన్‌ కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఇది National Disaster Management Authority (NDMA) నిర్వహించిన అత్యవసర మొబైల్ హెచ్చరికల పరీక్షలో భాగం మాత్రమే. దేశ అత్యవసర సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఎన్‌డీఎంఏ నేడు దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించింది. ఈ ప్రక్రియలో భాగంగానే నేడు ఉదయం 11:46 గంటలకు దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లకు ఒకేసారి పెద్ద శబ్దం లేదా వైబ్రేషన్‌తో కూడిన హెచ్చరిక సందేశం పంపారు.

వివరాలు

వ్యవస్థ పనితీరు పరిశీలించడానికే ఈ చర్యలు

ఈ అలర్ట్ వ్యవస్థ ప్రధాన ఉద్దేశ్యం ప్రకృతి విపత్తులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే సమాచారం చేరేలా చేయడం. అదే వ్యవస్థ పనితీరును పరీక్షించడానికే ఈ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement