Loading...
CJI: ఢిల్లీలో కాంగ్రెస్ మార్చ్‌.. న్యాయవాదులకు ఇబ్బందులు కలగొద్దన్న సీజేఐ
ఢిల్లీలో కాంగ్రెస్ మార్చ్‌.. న్యాయవాదులకు ఇబ్బందులు కలగొద్దన్న సీజేఐ

CJI: ఢిల్లీలో కాంగ్రెస్ మార్చ్‌.. న్యాయవాదులకు ఇబ్బందులు కలగొద్దన్న సీజేఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న సుప్రీంకోర్టు మార్చ్‌ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని ఢిల్లీ పోలీసులకు స్పష్టం చేశారు. నిరసనలు, ఆందోళనల కారణంగా న్యాయస్థానాల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడకూడదని సూచించారు. భద్రతా ఆంక్షల వల్ల న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోకుండా రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై విచారణల ద్వారానే పరిష్కారం సాధ్యమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశాలపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది.

వివరాలు 

సీఈసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు మార్చ్

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, 'సర్‌' ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నేతృత్వంలోని 'ఇండియా' కూటమి కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేపడుతోంది.

ఈ ఆందోళనల్లో భాగంగా సీఈసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు మార్చ్‌ నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుంది.

ఇందులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌తో పాటు ఇండియా కూటమి నేతలు పాల్గొననున్నారు.

వివరాలు 

సీఈసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు మార్చ్

వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ మార్చ్‌లో పాల్గొననున్నారు.

యువత, ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ సంస్థలు ఈ మార్చ్‌లో భాగస్వాములు కావాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు.

భారత ప్రజల తరఫున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పిస్తామని ఆయన తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

మరోసారి మెట్రో సేవలపై ఆంక్షలు

సుప్రీంకోర్టు మార్చ్‌ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో సేవలపై మరోసారి ఆంక్షలు విధించారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఆరు మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది.

ఈ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

పటేల్‌ చౌక్‌, జన్‌పథ్‌, రాజీవ్‌ చౌక్‌, మండీ హౌస్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌, బరాఖంబా మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేయనున్నట్లు తెలిపింది.

ADVERTISEMENT