AP Registration: ఏపీలో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్.. ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేసేలా ఉత్తర్వులు విడుదల చేసింది.
డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు ముందుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునేలా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు.
ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఆన్‌లైన్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
దీని ద్వారా డిజిటల్ టోకెన్ పొందడం ద్వారా, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, వివాహ రిజిస్ట్రేషన్ వంటి సేవలను ఎంచుకునే వీలుంటుంది.
టోకెన్ పొందిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ రూపొందించబడుతుందని తెలిపారు.
వివరాలు
స్లాట్ బుకింగ్ సేవలు పూర్తిగా ఉచితం
ప్రభుత్వం అందించే స్లాట్ బుకింగ్ సేవలు పూర్తిగా ఉచితం అని స్పష్టం చేశారు.
అయితే, ఇప్పటికే బుక్ చేసుకున్న స్లాట్‌ను రద్దు చేయాలంటే ₹100, సమయాన్ని మార్పు చేసుకోవాలంటే ₹200 చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
స్లాట్ బుక్ చేసుకున్న ముందురోజే డాక్యుమెంట్‌లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫీజులను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది.
ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రజల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ప్రభుత్వం నమ్మకంగా పేర్కొంది.