Loading...
ECI: కొత్త ఓటర్లకు ఊరట.. ఫారం 6 నుంచి ఎస్‌ఐఆర్ డిక్లరేషన్‌ను వేరు చేసిన ఈసీ
కొత్త ఓటర్లకు ఊరట.. ఫారం 6 నుంచి ఎస్‌ఐఆర్ డిక్లరేషన్‌ను వేరు చేసిన ఈసీ

ECI: కొత్త ఓటర్లకు ఊరట.. ఫారం 6 నుంచి ఎస్‌ఐఆర్ డిక్లరేషన్‌ను వేరు చేసిన ఈసీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో కొత్త ఓటు నమోదు కోసం సమర్పించే ఫారం 6 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) డిక్లరేషన్‌ను పూర్తిగా వేరు చేసింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఈ నిబంధన అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవాలనుకునే పౌరులు ఇకపై ఆన్‌లైన్‌లో ఫారం 6 నింపేటప్పుడు ఎస్‌ఐఆర్ డిక్లరేషన్‌ను జత చేయాల్సిన అవసరం లేదు. ఈ డిక్లరేషన్‌ను విడిగా సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు 

పారదర్శకత పెంపు.. నిర్ణయాల ప్రక్రియలో మార్పులు

ఎన్నికల సంఘంలో పారదర్శకతను పెంచడంతోపాటు నిర్ణయాల ప్రక్రియను సులభతరం చేసేందుకు చేపడుతున్న మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.

అంతర్గత నిర్వహణకు సంబంధించి మరికొన్ని కీలక మార్పులను కూడా అమల్లోకి తీసుకొచ్చింది.

ఇకపై ఎన్నికల సంఘం అధికారుల సమావేశాల అజెండాను ముందుగానే సభ్యులకు పంపించనున్నారు.

సమావేశం ముగిసిన తర్వాత అధికారికంగా మినిట్స్‌ను కూడా జారీ చేయనున్నారు.

గతంలో ఈ విధానం అమలులో ఉండేది కాదు. ఈ మార్పులతో సమావేశాల నిర్వహణలో మరింత స్పష్టత, పారదర్శకత తీసుకురావాలని ఈసీ భావిస్తోంది.

వివరాలు 

అధికారుల విదేశీ పర్యటనలకూ ముందస్తు అనుమతి

ఎన్నికల సంఘంలో పనిచేసే అధికారులు విదేశాలకు వెళ్లాలంటే ఇకపై ముందస్తుగా ఈసీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి.

ఈ మేరకు విదేశీ పర్యటనలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో ఇలాంటి ముందస్తు అనుమతి తీసుకునే విధానం అమలులో ఉండేది కాదు.

ADVERTISEMENT

వివరాలు 

ఐటీ మాడ్యూళ్ల ఆమోదానికి ప్రత్యేక కమిటీ

కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మాడ్యూళ్ల అభివృద్ధి, ఆమోద ప్రక్రియలోనూ ఎన్నికల సంఘం కీలక మార్పులు చేపట్టింది.

గతంలో కొత్త ఐటీ మాడ్యూళ్ల ఆమోదం విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల మధ్య తీవ్ర విభేదాలు, వివాదాలు చోటుచేసుకునేవి.

ఈ నేపథ్యంలో ఆమోద ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు.

ఇకపై కొత్త ఐటీ మాడ్యూళ్ల ప్రతిపాదనలను నేరుగా ఎన్నికల సంఘం ముందుకు తీసుకురాకుండా, ముందుగా ప్రత్యేక కమిటీకి పంపిస్తారు.

ఆ కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే తుది పరిశీలన కోసం ఎన్నికల సంఘం ముందుకు తీసుకువస్తారు.

ADVERTISEMENT