తదుపరి వార్తా కథనం

Vizag: విశాఖ విమానాశ్రయంలో మంచు ప్రభావం.. విమానాల దారి మళ్లింపు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 07, 2024
09:40 am
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం విమానాశ్రయంలో శనివారం ఉదయం తక్కువ వెలుతురు, మంచు ఆవరణం కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.
ఈ పరిస్థితుల కారణంగా పలు విమానాలు ఇతర నగరాల వైపు మళ్లించారు. దిల్లీ-విశాఖ విమానం భువనేశ్వర్‌కు, హైదరాబాద్-విశాఖ, బెంగళూరు-విశాఖ విమానాలు తిరిగి హైదరాబాద్‌కు మళ్లించినట్లు విశాఖపట్నం విమానాశ్రయ డైరక్టర్ రాజారెడ్డి పేర్కొన్నారు.
ప్రయాణికులు ఈ మార్పుల గురించి ముందుగా సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు.
మంచు దట్టంగా ఉండడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడినట్లు డైరెక్టర్ వెల్లడించారు.
పరిస్థితులు మెరుగుపడిన వెంటనే విమాన సర్వీసులు సాధారణ స్థితికి వస్తాయని చెప్పారు.