Loading...
El Nino Effect: ఎల్‌నినో ప్రభావం.. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. 2 రోజుల్లో మరింత వేడి
2 రోజుల్లో మరింత వేడి

El Nino Effect: ఎల్‌నినో ప్రభావం.. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. 2 రోజుల్లో మరింత వేడి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2026
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్,మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35డిగ్రీలకు చేరాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 34డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో సాధారణంగా ఈ సమయంలో 31.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సి ఉండగా.. ఆదివారం 34 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవడానికి ఎల్‌నినో (El Nino) ప్రభావమే ప్రధాన కారణమని పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణలో పెరుగుతున్న ఎండలు..  

ADVERTISEMENT