పవన్ కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్: గాజు గ్లాసు గుర్తు తిరిగి జనసేనకు కేటాయింపు
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి గుడ్‌న్యూస్ అందింది. జనసేనకు తిరిగి గాజు గ్లాసును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనసేనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జనసేనను రిజస్టర్డ్ పార్టీలో జాబితాలో ఎన్నికల సంఘం చేర్చింది. అలాగే టీడీపీ, వైసీపీలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఉంచింది. ఇటీవల జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును కేంద్ర ఎన్నికల సంఘం రిజర్వ్ చేసింది. ఆ సింబల్‌ను ఎవరికైనా కేటాయించబడే ఉచిత చిహ్నాల జాబితాలో గాజు గ్లాసును చేర్చిన విషయం తెలిసింది. వాస్తవానికి జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించికుంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాజును పార్టీ గుర్తుగా పొందింది.
అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేనకు పార్టీ సింబల్ చాలా కీలకం
2019లో జనసేన పార్టీకి అవసరమైన 8 శాతం ఓట్లను సాధించడంలో విఫలమైన నేపథ్యంలో ఈసీ జనసేన గాజు గ్లాజు గుర్తును ఉపసంహరించుకుంది. ఆ ఎన్నికల్లో జనసేనకు ఏడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉండటంతో ఇప్పుడు జనసేనకు గాజు గ్లాసు గుర్తు అనేది చాలా కీలకం. ఇదిలా ఉంటే, టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే భవిష్యత్‌లో పవన్ కళ్యాణ్ పార్టీకి మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జనసేనకు టీడీపీ 25కు మించి సీట్లు ఇవ్వదనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మళ్లీ జనసేను ఓటు శాతం తగ్గితే గాజు గ్లాసును మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం రిజర్వ్ చేసే అవకాశం ఉంది.