
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించండి: ఎన్నికల సంఘం
ఈ వార్తాకథనం ఏంటి
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డీకే అరుణను అధికారికంగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ పంపింది.
ఈ అంశానికి సంబంధించిన హైకోర్టు ఉత్తర్వులు రాబోయే అధికారిక గెజిట్‌లో ప్రచురించాలని చెప్పింది.
జోగులాంబ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా బి.కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈసీ ఈ ప్రకటన చేసింది.
కృష్ణమోహన్ రెడ్డి తన నామినేషన్ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం సమర్పించడం వల్ల హైకోర్టు ఆయన ఎన్నికల చెల్లదని తీర్పు చెప్పింది.
కృష్ణమోహన్ రెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు పొందిన డీకే అరుణను కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖ
#ECI @ECISVEEP writes to #Telangana legislature secretary, TS govt to recognize @aruna_dk as elected from #Gadwal constituency following court orders voiding election of @BRSparty candidate B Krishna Mohan Reddy as the winner in 2018 polls @DeccanChronicle @oratorgreat pic.twitter.com/TbUwQCjNhQ
— Balu Pulipaka (@BaluPulipaka) September 4, 2023