తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్
తెలంగాణలో విద్యుత్ డిమాండ్‌పై కరెంటు పంపిణీ సంస్థలు కీలక అంచనాలను వెల్లడించాయి. వచ్చే 10ఏళ్లలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది( 2023-24) తెలంగాణలో విద్యుత్ వినియోగం దాదాపు 70వేల మినియన్ యూనిట్లు ఉంటుందని డిస్కీం సంస్థలు చెప్పుకొచ్చాయి. అయితే ఇప్పటి లెక్కలను బట్టి చూస్తే, 2033-34లో 1.40లక్షల మినియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కావొచ్చని డిస్కీం సంస్థల అభిప్రాయం. అయితే 5ఏళ్లకు ఒకసారి విద్యుత్ డిస్కీం సంస్థలు 'కంట్రోల్ పీరియడ్' పేరుతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిస్కీం సంస్థలు నివేదికను విడుదల చేస్తాయి. అందులో భాగంగా తాజాగా ఐదేళ్ల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్ర మండలికి ఆయా సంస్థలు అందజేశాయి.
రూ.37,911కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టాలని డిస్కీంల సూచన
అయితే వచ్చే పదేళ్లలో విద్యుత్ అవసరాలను తీర్చాలంటే ఇప్పటి నుంచి చర్యలు చేపట్టాలని డిస్కీంలు తమ నివేదికలో అభిప్రాయపడ్డాయి. కరెంట్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను ఆధునికీకరించాలని నియంత్ర మండలికి సూచించాయి. దాదాపు రూ.37,911కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంటుందని డిస్కీంలు అంచనా వేశాయి. భవిష్యత్‌లో కరెంట్ కోతను నివారించేందుకు, కొనుగోలు చేయడానికి అనుమతులు మంజూరు చేయాలని నియంత్ర మండలిని కోరాయి. ఈ క్రంమలో డిస్కీంలు విడుదల చేసిన నివేదికపై తమ అభ్యంతరాలను చెప్పాలని నియంత్రణ మండలి కోరింది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి