
సాంకేతిక లోపంతో దిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఈ వార్తాకథనం ఏంటి
విమానంలోని ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ఇండిగో ఫ్లైట్ ను అత్యవసరంగా దించేశారు. ఈ మేరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి పైలట్ సమాచారం ఇచ్చారు.
బుధవారం డెహ్రాడూన్‌కు వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ దిల్లీ ఇంటర్నేషన్ ఏయిర్ పోర్ట్ కు తిరిగి వచ్చేసింది. అయితే సదరు విమానం క్షేమంగానే ల్యాండ్ అయ్యిందని ఇండిగో వెల్లడించింది.
ఈ నేపథ్యంలో అవసరమైన సహాయ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. దిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్లే ఇండిగో విమానం టెక్నికల్ ఇష్యూతో వెనక్కి వచ్చేసింది.
తొలుత విమానంలోని సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే తమకు సమాచారం అందించాడని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
DETAILS
పాత విమానాల స్థానంలో ఇండిగో కొత్త ఫ్లైట్లు
అనంతరం అత్యవసర ల్యాండింగ్ కావాలని కోరడంతో విమానం దిల్లీలో సేఫ్ గా ల్యాండ్ అయ్యిందని వివరించింది. అవసరమైన మరమ్మతుల తర్వాత ఫ్లైట్ తిరిగి కమర్షియల్ ఆపరేషన్‌లో భాగం అవుతుందని స్పష్టం చేసింది.
అయితే విమానంలో మంటలు చెలరేగినట్లు వస్తున్న వార్తలను సంస్థ ఖండించింది. ఏవియేషన్ రెగ్యులేటరీ, డీజీసీఏ
(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఈ సంఘటనపై అధికారికంగా ప్రకటించలేదు.
2030 నుంచి 2035 మధ్య 500 కొత్త విమానాల కొనుగోలుకు ఇండిగో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇందుకు సంబంధించి విమాన తయారీదారు ఎయిర్‌బస్ సంస్థతో బిగ్ డీల్ ను సైతం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఇండిగో పాత విమానాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకునే పనిలో ఉంది.