Emirates A380: హైదరాబాద్‌కు ఎమిరేట్స్ ఎ-380 సేవలు త్వరలో.. సీఎం రేవంత్‌తో కీలక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాల్లో ఒకటైన ఎమిరేట్స్ ఎ-380 సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమిరేట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ వెల్లడించారు. భారత్‌లో ఎమిరేట్స్ కార్యకలాపాలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరింత విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. అలాగే తెలంగాణలో మరో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో, ఆ విమానాశ్రయాల నుంచి కూడా ఎమిరేట్స్ సేవలను ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
వివరాలు
సానుకూల స్పందన వ్యక్తం చేసిన సార్థన్
రాష్ట్రంలో పౌర విమానయాన రంగం అభివృద్ధికి ఎమిరేట్స్ భాగస్వామ్యం కీలకంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ ప్రతిపాదనలపై మహమ్మద్ సార్థన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
అదేవిధంగా, గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందించేందుకు ఎమిరేట్స్ సంస్థ స్పాన్సర్‌గా ముందుకు రావాలని సీఎం కోరారు.
ఈ అంశంపైనా సార్థన్ సానుకూల స్పందన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ ఎ-380 విమానాలు..
#WATCH | Hyderabad, Telangana: Mohammed Sarhan, Vice President (India) of Emirates, paid a courtesy call on Chief Minister Revanth Reddy.
— ANI (@ANI) July 11, 2026
During the meeting, Mohammed Sarhan informed the CM of the company's willingness to launch Emirates A-380 services in Hyderabad. Welcoming… pic.twitter.com/hJZsuVIB2V