Page Loader
Encounter : జమ్ముకాశ్మీర్‌లోని దోడాలో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్‌ మృతి
జమ్ముకాశ్మీర్‌లోని దోడాలో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్‌ మృతి

Encounter : జమ్ముకాశ్మీర్‌లోని దోడాలో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్‌ మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2024
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు జవాన్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది జవాన్లు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా బుధవారం జమ్ముకాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్ వీర మరణం పొందాడు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ఉగ్రవాదులు కూడా మృతి చెందినట్లు తెలిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Details

దోడాలో కొనసాగుతున్న ఆపరేషన్

దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా, ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్ కెప్టెన్ ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో అత్యాధునిక ఎం4 రైఫిల్‌తో పాటు మూడు బ్యాక్ ప్యాక్ బ్యాగ్‌లను ఆ ప్రాంతంలో గుర్తించారు.