LOADING...
Nagarkurnool: మూడు టెంకల అరుదైన మామిడిపండు.. 'విరూప' పండు
మూడు టెంకల అరుదైన మామిడిపండు.. 'విరూప' పండు

Nagarkurnool: మూడు టెంకల అరుదైన మామిడిపండు.. 'విరూప' పండు

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన కాన్గుల అంజయ్య మామిడితోటలో అరుదైన మామిడిపండు కనిపించింది. సాధారణంగా ఒకే టెంకతో ఉండే మామిడిపండు, ఈసారి మూడు టెంకలతో కాయడం స్థానికంగా ఆసక్తిని కలిగించింది. ఈ విషయంపై స్పందించిన కల్వకుర్తి ఉద్యానశాఖ అధికారిణి కె. మహేశ్వరి.. దీనిని విరూప పండుగా పిలుస్తారని తెలిపారు.

వివరాలు 

వంద కాయల్లో 0-1 శాతం ఇలా కాస్తాయి

పరాగ సంపర్కం సరిగా జరగకపోవడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడం, అలాగే సూక్ష్మపోషకాల కొరత వంటి కారణాల వల్ల ఇలాంటి పండ్లు ఏర్పడతాయని వివరించారు. ముఖ్యంగా బోరాన్‌, జింక్‌ లోపం ఉన్నప్పుడు పండు సమానంగా పెరగకుండా వంకర ఆకారంలో తయారవుతుందని చెప్పారు. వంద మామిడికాయల్లో 0-1 శాతం ఇలాంటి విరూప పండ్లు కనిపిస్తాయని ఉద్యానశాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement