'Fake alert': రామఫోసా అనారోగ్యంపై పుకార్లు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేస్తూ 'ఫేక్ అలర్ట్' జారీ చేసింది. బ్రిక్స్ సదస్సుకు హాజరైన నేతల ఆరోగ్యంపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. రామఫోసా వైద్య బృందం సూచన మేరకు విశ్రాంతి తీసుకునేందుకు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్ష భవనం బుధవారం వెల్లడించింది. 73 ఏళ్ల రామఫోసా సోమవారం న్యూదిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లారు. అనంతరం వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకుని కోలుకోవాలని సూచించినట్లు తెలిపింది. అయితే, ఆయనకు ఉన్న అనారోగ్యంపై అధ్యక్ష భవనం ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
వివరాలు
తప్పుడు పోస్టులపై భారత విదేశాంగ శాఖ హెచ్చరిక
షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన బహిరంగ కార్యక్రమాలకు వీలైన చోట సంబంధిత మంత్రులు తన తరఫున హాజరయ్యేలా రామఫోసా కోరినట్లు అధ్యక్ష భవనం పేర్కొంది.
మరోవైపు,దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషటైలే కూడా స్వల్ప వైద్య ప్రక్రియ అనంతరం కోలుకుంటున్న కారణంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
ఇటీవల ఆయన తరఫున కొన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి.
రామఫోసా ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని భారత విదేశాంగశాఖకు చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం ఖండించింది.
ఈ వార్తలు అవాస్తవమని పేర్కొంటూ'ఫేక్ అలర్ట్'జారీ చేసింది.
సోషల్ మీడియా వేదికల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు పోస్టులు చేస్తున్నారని హెచ్చరించింది.
"సోషల్ మీడియా వేదికల్లో ఇలాంటి హానికరమైన పోస్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం"అని విదేశాంగ శాఖ పేర్కొంది.
వివరాలు
భారత నాయకత్వాన్ని ప్రశంసించిన రామఫోసా
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 13న న్యూదిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామఫోసా భారత్ నాయకత్వాన్ని ప్రశంసించారు.
బ్రిక్స్ అధ్యక్ష దేశంగా భారత్ సభ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, న్యూదిల్లీ ప్రకటనను ఆమోదించేలా చేసిందని అన్నారు.
ప్రకటనపై ఏకాభిప్రాయం సాధ్యమవుతుందా? అనే సందేహాలు ఉన్నప్పటికీ, సభ్య దేశాలన్నీ కలిసి పనిచేసి ఒప్పందానికి వచ్చినట్లు రామఫోసా తెలిపారు.
సదస్సును విజయవంతంగా నిర్వహించి, చర్చలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లినందుకు భారత్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
"ఈ బ్రిక్స్ సదస్సులో ప్రకటనను ఆమోదించలేమని చాలామంది భావించారు. కానీ మేము దాన్ని సాధించాం.
ఈ విషయంలో బ్రిక్స్ సభ్య దేశాలన్నింటినీ, ముఖ్యంగా విజయవంతమైన సదస్సును నిర్వహించిన భారత్‌ను అభినందిస్తున్నాం" అని రామఫోసా పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రామఫోసా ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక
⚠️ Misleading!
— MEA FactCheck (@MEAFactCheck) September 17, 2026
We caution against such malicious posts on social media platforms! pic.twitter.com/YvsNEQ3Jy2