
Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా రైతు కుటుంబం ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాటుతో ఓ రైతు కుటుంబం నాశనం చేసింది. ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన హరీశ్ అనే రైతు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో దాదాపు రూ. 20 లక్షలు పోగొట్టుకున్నాడు.
తన పొలం కూడా అమ్ముకోవాల్సిన స్థితికి చేరుకున్నాడు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, చివరికి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బెట్టింగ్‌లో నష్టాలు చవిచూసిన హరీశ్, అప్పులు చేసి వాటిని తీర్చలేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడు.
Details
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఉన్న పొలం అమ్మినా కూడా ఇబ్బందులు వెంటడాయి. దీంతో తల్లిదండ్రులు సురేశ్, హేమలతకు ఉరి వేసి, అనంతరం హరీశ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆన్ లైన్ బెట్టింగ్ జోలికి ఎవరూ వెళ్లకూడదని, దీని వల్ల కుటుంబాలు చిన్నభిన్నమవుతాయని పోలీసులు హెచ్చరించారు.