Page Loader
Bhu Bharati: భూ భారతిలో రైతులకు ఇబ్బందులు.. దరఖాస్తు తర్వాత ఇ-కేవైసీ కష్టాలు!
భూ భారతిలో రైతులకు ఇబ్బందులు.. దరఖాస్తు తర్వాత ఇ-కేవైసీ కష్టాలు!

Bhu Bharati: భూ భారతిలో రైతులకు ఇబ్బందులు.. దరఖాస్తు తర్వాత ఇ-కేవైసీ కష్టాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 22, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

సాగు భూముల రిజిస్ట్రేషన్‌కు వినియోగిస్తున్న భూ భారత్ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు చేసుకునే రైతులు మీసేవ కేంద్రాలకు వెళ్తున్నప్పటికీ, 'ఈ-కేవైసీ' ప్రక్రియ పూర్తి కావడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వారసత్వ బదిలీ, వివరాల సవరణ, తండ్రి పేరు, లింగం, భూ విస్తీర్ణం మార్పులు తదితర సేవల కోసం దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించిన తర్వాత 'ఈ-కేవైసీ'ను పూర్తి చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియలో ఎలక్ట్రానిక్ రూపంలో వినియోగదారుడు ఎవరు? అన్న విషయాన్ని బయోమెట్రిక్ ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈ అవకాశాన్ని చూపించే ఐచ్ఛికం ప్రస్తుతానికి కనిపించడం లేదు. గతంలో ధరణి పోర్టల్‌లో ఈ-కేవైసీ ఐచ్ఛికం అందుబాటులో ఉండేది. కానీ భూ భారతిలో ఆ ఎంపిక తెరుచుకోకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Details

లాగిన్‌ తప్పనిసరి - అవగాహన లోపం 

భూ భారత్ పోర్టల్‌లో లావాదేవీల వివరాలను తెలుసుకోవాలంటే, వినియోగదారులు తప్పనిసరిగా లాగిన్‌ కావాల్సి వస్తోంది. పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్‌ కావాలి. అయితే దీనిపై అవగాహన లేకపోవడం వల్ల రైతులు మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అక్కడి నిర్వాహకులు కొంత రుసుము తీసుకొని తమ లాగిన్‌ ద్వారా అవసరమైన సమాచారం ఇవ్వడంతో రైతులు అదేపనిగా వారు దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరణి పోర్టల్‌లో లాగిన్‌తో పాటు సాధారణ పద్ధతిలోనూ సమాచారం తెలుసుకునే వీలుండేది. కానీ భూ భారతిలో ఆ వెసులుబాటు లేదు.

Details

భూమి పట్టాలు అందుబాటులో లేవు 

గ్రామాలు, కమతాల భూముల పటాలు కూడా ధరణి మాదిరిగా భూ భారతిలో స్పష్టంగా కనిపించడంలేదు. జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ లేదా ఖాతా నంబరు నమోదు చేసిన తర్వాత భూమిపటాలు చూపించాల్సి ఉన్నా, ప్రస్తుతం అవి అందుబాటులోకి రాలేదు. రెవెన్యూ శాఖ వర్గాల ప్రకారం, పైలట్‌ మండలాల్లో పరీక్షలు పూర్తయ్యాక మాత్రమే భూ భారతిలో అన్ని సేవలు సక్రమంగా అందుబాటులోకి రానున్నాయి. తద్వారా రైతులకు అవసరమైన సమాచారం సులభంగా లభించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.