One Nation One Election: జమిలి ఎన్నికలు.. నేడు పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
"ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదన"కు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) మొదటి సమావేశం ఈ రోజు (జనవరి 8) జరుగనుంది.
ఈ సమావేశంలో ప్రతిపాదిత చట్టాల నిబంధనలను జేపీసీ సభ్యులకు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు వివరిస్తారని సమాచారం.
అంతేగాక, జేపీసీ వివిధ అభిప్రాయాలను కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జేపీసీ తన నివేదికను వచ్చే పార్లమెంట్ సెషన్‌లో, మొదటి వారంలో లోక్‌సభలో సమర్పించాలని నిర్ణయించుకుంది.
దీనిపై సుదీర్ఘ చర్చ జరపాలని కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
వివరాలు
39 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి అధ్యక్షుడు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో, 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశ పెట్టారు.
ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే, ప్రతిపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో, కేంద్ర సర్కార్ ఈ బిల్లును మరింత కసరత్తు చేయడానికి జేపీసీకి పంపించింది.
39 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
కమిటీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, జేడీయూ నుంచి సంజయ్ ఝా, శివసేన (షిండే) నుంచి శ్రీకాంత్ షిండే, తృణమూల్ నుండి కళ్యాణ్ బెనర్జీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌తో పాటు ఇతర సభ్యులు కూడా ఉన్నారు.