
Andhra pradesh: 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన వరద.. డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలోని 31 సాగునీటి ప్రాజెక్టుల్లో స్పిల్‌వేలు (అదనపు జలవిసర్జన మార్గాలు)నిర్మాణ సామర్థ్యాన్ని మించి వరదలు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది.
ఈ ప్రాజెక్టులు నిర్మించిన సమయంలో అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి గరిష్ఠ వరద ప్రవాహాన్ని అంచనా వేసి, ఆ మేరకు స్పిల్‌వేలు, కరకట్టలు నిర్మించారు.
అయితే, వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా, అప్పట్లో నిర్ణయించిన ప్రమాణాలు ఇప్పుడు సరిపోవు అన్న విషయం స్పష్టమైంది.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని,ఆయా ప్రాజెక్టుల్లో అదనంగా స్పిల్‌వేలను నిర్మించడం,అవసరమైన ఇతర భద్రత చర్యలను చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.
జాతీయ డ్యాం భద్రతా చట్టం (National Dam Safety Act) ప్రకారం,దేశవ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల భద్రతను అంచనా వేసేందుకు ఇలాంటి అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.
వివరాలు
ప్రతి రాష్ట్రంలో డ్యాం భద్రతా అథారిటీ
గతంలో కొన్ని ప్రాజెక్టుల్లో డ్యాం కొట్టుకుపోయిన ఘటనలు, ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం డ్యాం భద్రతకు మరింత ప్రాధాన్యత ఇచ్చింది.
2021లో అమలులోకి వచ్చిన జాతీయ డ్యాం భద్రతా చట్టం 54(2)(క్యూ) సెక్షన్ ప్రకారం, రాష్ట్రాలు నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా డ్యాంల భద్రతపై సమగ్ర పరిశీలనలు చేయాల్సి ఉంది.
ఈ చట్టంలో డ్యాం భద్రతకు సంబంధించి అనేక మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అందులో భాగంగా, ప్రతి రాష్ట్రంలో డ్యాం భద్రతా అథారిటీ ఏర్పాటైంది.
వివరాలు
రాష్ట్రంలోని 167 డ్యాంలపై సమగ్ర అధ్యయనం
మొత్తంగా రాష్ట్రంలో ఉన్న 167 డ్యాంలను అధ్యయనానికి తీసుకున్నారు.ఒక్కో జలాశయం ఎంత మేర నీటిని నిల్వ చేయగలదు?స్పిల్‌వే ఎక్కడివరకు నిర్మించబడింది?దానికి ఆనుకొని ఉన్న కట్టల ఎత్తు ఎంత?స్పిల్‌వే పొడవు ఎంత?గరిష్ఠంగా నీటిని నిల్వ చేసే స్థాయి ఎంత?అనే అంశాల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది.
ఈఅధ్యయనం అనంతరం 31 డ్యాంలు అత్యధిక ప్రమాద స్థాయిలో ఉన్నాయని గుర్తించారు.
ఇప్పటికీ ఆప్రాజెక్టుల్లో ఉన్న స్పిల్‌వేల సామర్థ్యం,వరద ప్రవాహానికి తట్టుకునేలా లేదన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు.
తాజాగా జాతీయడ్యాం భద్రతా అథారిటీ ఛైర్మన్ నేతృత్వంలోని ఒక బృందం రాష్ట్రానికి వచ్చి, డ్యాంల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమీక్షించింది.
భవిష్యత్తులో పెద్దముప్పులు ఎదురుకాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని భద్రతాచర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఈసమీక్షలో తేలింది.