Loading...
Sonia Gandhi: సీరియల్‌ కిల్లర్‌ ప్రియురాలికి సోనియా ఇంటి నుంచి భోజనం!
సీరియల్‌ కిల్లర్‌ ప్రియురాలికి సోనియా ఇంటి నుంచి భోజనం!

Sonia Gandhi: సీరియల్‌ కిల్లర్‌ ప్రియురాలికి సోనియా ఇంటి నుంచి భోజనం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తిహాడ్‌ జైలులో ఉన్న సమయంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. జైలులో ఉన్న తన అత్త ఇందిరాగాంధీ కోసం సోనియా గాంధీ ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లేవారు. అయితే, ఓసారి ఆమె సీరియల్‌ కిల్లర్‌ ఛార్లెస్‌ శోభరాజ్‌ ప్రియురాలికి కూడా భోజనం అందించారట. ఈ విషయాన్ని సోనియా గాంధీ తన ఆత్మకథ 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌'లో వెల్లడించారు.

వివరాలు 

ఖైదీగా ఉన్న ఓ విదేశీ యువతికి భోజనం

''అత్తమ్మ తిహాడ్‌ జైలులో ఉన్నప్పుడు తనతో పాటు మరికొంతమందికి కూడా భోజనం తీసుకురావాలని చెప్పేవారు. అలా ఓసారి ముగ్గురు మహిళా గార్డులతో పాటు జైలులో ఖైదీగా ఉన్న ఓ విదేశీ యువతికి కూడా భోజనం తీసుకెళ్లాను. అయితే, ఆ యువతి ఎవరనే విషయం అప్పట్లో నాకు తెలియదు. ఆమె భారత్‌తో పాటు థాయ్‌లాండ్‌, నేపాల్‌ తదితర దేశాల్లో పలువురి హత్య కేసుల్లో దోషిగా తేలిన ఛార్లెస్‌ శోభరాజ్‌ ప్రియురాలని తర్వాత తెలిసింది'' అని సోనియా తన పుస్తకంలో రాసుకొచ్చారు.

అయితే, ఆ యువతి పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు.

వివరాలు 

అరెస్టయిన మహిళల్లో శోభరాజ్‌ ప్రియురాలు మేరీ ఆండ్రీ లెక్లెర్క్

భారత్‌-వియత్నాం సంతతికి చెందిన ఛార్లెస్‌ శోభరాజ్‌ 1970వ దశకంలో ఆసియాలోని పలు దేశాల్లో అనేక హత్యలకు పాల్పడ్డాడు.

ఈ క్రమంలో 1976 జులైలో భారత పోలీసులు అతడితో పాటు ముగ్గురు మహిళలను అరెస్టు చేసి తిహాడ్‌ జైలుకు తరలించారు.

అరెస్టయిన మహిళల్లో శోభరాజ్‌ ప్రియురాలు మేరీ ఆండ్రీ లెక్లెర్క్‌ కూడా ఉన్నారు.

ఈ హత్య కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమె క్యాన్సర్‌ బారిన పడటంతో 1983లో కెనడాకు తిరిగి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది.

ఆ తర్వాత ఏడాదే ఆమె మరణించింది.

ADVERTISEMENT

వివరాలు 

2022లో ఫ్రాన్స్‌కు శోభరాజ్

మరోవైపు 1986లో ఛార్లెస్‌ శోభరాజ్‌ తిహాడ్‌ జైలు నుంచి తప్పించుకున్నాడు.

అయితే, పోలీసులు అతడిని తిరిగి అరెస్టు చేశారు. అనంతరం 1997లో బెయిల్‌పై విడుదలయ్యాడు.

2004లో నేపాల్‌లో జరిగిన ఓ హత్య కేసులో అక్కడి న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.

చివరకు 2022లో జైలు నుంచి విడుదలైన శోభరాజ్‌ ఫ్రాన్స్‌కు వెళ్లిపోయాడు.

ఇదిలా ఉండగా.. ఎమర్జెన్సీ అనంతరం 1978లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీని అరెస్టు చేసి తిహాడ్‌ జైలుకు పంపింది.

కొన్ని రోజుల పాటు అక్కడ ఉన్న ఆమె అదే ఏడాది డిసెంబరు 26న విడుదలయ్యారు. అనంతరం 1980లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని చేపట్టారు.

ADVERTISEMENT