Page Loader
Dearness Allowance: డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచే యోచనలో కేంద్రం 
డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచే యోచనలో కేంద్రం

Dearness Allowance: డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచే యోచనలో కేంద్రం 

వ్రాసిన వారు Stalin
Jul 17, 2023
07:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచనున్నట్లు సమాచారం. దాదాపు 4శాతం డీఏను పెంచే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు న్యూస్ 18 వార్తా సంస్థ తెలిపింది. ఈ నాలుగు శాతం పెంపుతో డీఏ 46శాతానికి చేరుకుంటుంది. డీఏ సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు పెంచుతారు. అదికూడా జనవరి, జూలై నెలలో సవరిస్తారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తన ఉద్యోగులకు డీఏను నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

డీఏ

డీఏ- డీఆర్‌కు మధ్య తేడా ఇదే

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తారు. పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) అందజేస్తారు. అధికారిక లెక్కల ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో సుమారు 69.76 లక్షల మంది పెన్షనర్లు, 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కేంద్రం ప్రకటించబోయే డీఏ పెంపు వల్ల ఈ పెన్షనర్లు, ఉద్యోగులు దాని ప్రయోజనాలను అందుకుంటారు. ఏఐఎస్ అధికారులందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం వారి వేతనాలను పొందుతారు.