Page Loader
Anju Nasrullah love story: ముస్లింగా మారిన అంజుకు పాకిస్థాన్ వ్యాపారవేత్త బహుమతులు 
ఇస్లాంలోకి వెళ్లిన అంజుకు పాకిస్థాన్ వ్యాపారవేత్త బహుమతులు

Anju Nasrullah love story: ముస్లింగా మారిన అంజుకు పాకిస్థాన్ వ్యాపారవేత్త బహుమతులు 

వ్రాసిన వారు Stalin
Jul 30, 2023
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌ బుక్ ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌‌కు వెళ్లిన భారత్‌కు చెందిన అంజు అక్కడే అతన్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నస్రుల్లాను పెళ్లాడటానికి ఇస్లాంలోకి మారి తన పేరును అంజు నుంచి ఫాతిమాగా మార్చుకుంది. అయితే ఇస్లాంలోకి మారిన అంజుకు పాకిస్థాన్ వ్యాపారవేత్త, స్టార్ గ్రూప్ కంపెనీల సీఈవో మొహసిన్ ఖాన్ అబ్బాసీ పలు బహుమతులు అందజేశాడు. అమెకు ప్లాట్ బహుమతిగా అందించాడు. అలాగే చెక్కును కూడా అందజేశారు. అయితే చెక్కులో ఎంత మొత్తం ఉందనేది వెల్లడించలేదు. అంతేకాదు, అంజుకు తన కంపెనీలో ఉద్యోగం కూడా ఇస్తానని వ్యాపారవేత్త మొహసిన్ ఖాన్ అబ్బాసీ హామీ కూడా ఇచ్చారు.

పాక్

అంజును చూసి మరింత మంది ఇస్లాంలోకి రావాలి: వ్యాపారవేత్త

భారత్ నుంచి వచ్చి అంజు ఇస్లాంను స్వీకరించిందని, ఆమెకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని అబ్బాసీ పేర్కొన్నారు. తన పాక్ సిటీ కంపెనీ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తుందని వ్యాపారవేత్త అబ్బాసీ తెలిపారు. అంజు ఇంటి కోసం నగరంలో 10 మర్ల (272.251 చదరపు అడుగులు) స్థలం ఇవ్వాలని తాము నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే, పాకిస్థాన్‌లోని ఇతర ధనవంతులను కూడా అంజుకు తోచిన విధంగా సాయం చేయాలని అబ్బాసీ పిలుపునిచ్చారు. అంజుకు పట్ల మనం చూపే ఆదరణ చూసి ఇతరులు కూడా ఇస్లాం స్వీకరించాలని మొహ్సిన్ ఖాన్ అబ్బాసీ అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న పాకిస్థాన్ వ్యాపారవేత్త అబ్బాసీ