Loading...
MEA: జెన్‌జీని దగ్గరయ్యేందుకు స్నాప్‌చాట్‌లో అధికారిక ఖాతా ప్రారంభించిన విదేశాంగశాఖ
జెన్‌జీని దగ్గరయ్యేందుకు స్నాప్‌చాట్‌లో అధికారిక ఖాతా ప్రారంభించిన విదేశాంగశాఖ

MEA: జెన్‌జీని దగ్గరయ్యేందుకు స్నాప్‌చాట్‌లో అధికారిక ఖాతా ప్రారంభించిన విదేశాంగశాఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

జెన్‌జీతో మరింత సన్నిహితంగా ఉండేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (MEA) కొత్త అడుగు వేసింది. యువత విస్తృతంగా వినియోగిస్తున్న సోషల్‌ మీడియా వేదిక స్నాప్‌ చాట్‌లో గురువారం తన అధికారిక ఖాతాను ప్రారంభించింది. ఇంటరాక్టివ్‌ కంటెంట్‌ ద్వారా యువతతో మరింత సమర్థంగా అనుసంధానం కావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు యువత ఎక్కువగా ఉపయోగిస్తున్న సోషల్‌ మీడియా వేదికలను సమర్థంగా వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో రీల్స్‌, ఇతర ఇంటరాక్టివ్‌ కంటెంట్‌ ద్వారా యువతతో మమేకం కావాలని ఆయన సూచించిన నేపథ్యంలో విదేశాంగశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

'ఎక్స్‌' వేదికగా వీడియోను షేర్ చేసిన రణధీర్‌ జైస్వాల్

ఈ సందర్భంగా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ 'ఎక్స్‌' వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు.

ఇప్పటి వరకు యువత తమను ఇన్‌స్టాగ్రామ్‌, లింక్డిన్‌ ద్వారా అనుసరిస్తున్నారని, ఇకపై స్నాప్‌చాట్‌లోనూ అధికారికంగా అందుబాటులో ఉంటామని తెలిపారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక కథనాలు, తాజా అప్‌డేట్‌లు,ఆసక్తికరమైన కంటెంట్‌ను ఈ ఖాతా ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు.

ఇటీవలి పేపర్‌ లీక్‌ నిరసనల సమయంలో యువత మీమ్స్‌, రీల్స్‌ వంటి డిజిటల్‌ కంటెంట్‌ను విస్తృతంగా ఉపయోగించింది.

ఈ మారుతున్న ధోరణిని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి మోదీ కూడా సోషల్‌ మీడియా ద్వారా యువతను చేరుకునే ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు.

పేపర్‌ లీక్‌ ఆందోళనలపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా జెన్‌జీని ఉద్దేశించి ఇప్పటికే ఐదు వీడియోలను పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'ఎక్స్‌' వేదికగా వీడియోను షేర్ చేసిన రణధీర్‌ జైస్వాల్

ADVERTISEMENT