LOADING...
Nadendla Bhaskar Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

Nadendla Bhaskar Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2026
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే రాజకీయ నేతలు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, శాసన సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాలు,ఆహారం,వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూత

Advertisement