NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TSPSC chairman: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి?
    తదుపరి వార్తా కథనం
    TSPSC chairman: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి?
    TSPSC chairman: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి?

    TSPSC chairman: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి?

    వ్రాసిన వారు Stalin
    Jan 23, 2024
    03:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ ఎం మహేందర్ రెడ్డిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఈ మేరకు ఆమోదం కోసం ప్రభుత్వం ఫైల్‌ను గవర్నర్ తమిళసైకి పంపింది.

    టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌తో పాటు సభ్యుల పోస్టుల భర్తీ కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి నేతృత్వంలో సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు చైర్మన్‌, మెంబర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.

    ఈ స్థానాలకు దాదాపు 371 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఒక్క చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు వచ్చాయి.

    ఛైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ పరిశీలనకు పంపింది.

    తెలంగాణ

    9 స్థానాలకు దరఖాస్తుల ఆహ్వానం

    మహేందర్ రెడ్డి ఇండియన్ పోలీస్ సర్వీస్ 1986 బ్యాచ్ అధికారి. సైబరాబాద్ కమిషనరేట్ కమిషనర్, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్, తెలంగాణ డీజీపీగా వివిధ హోదాలలో పనిచేశారు.

    ప్రస్తుతం, TSPSCలో 11 సభ్యుల పోస్టులు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు ఉన్నారు. దీంతో 9 స్థానాలకు దరఖాస్తులను ఆహ్వానించారు.

    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగానే TSPSCని రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    50శాతం పోస్టులకు సివిల్ సర్వీస్ అనుభవం ఉన్న అభ్యర్థులను పరిగణించాలని యోచిస్తోంది.

    మిగిలిన సగం సైన్స్, టెక్నాలజీ, విద్యావేత్తలు, ఇతర రంగాలలో నిపుణులచే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    టీఎస్పీఎస్సీ
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలంగాణ

    Kalvakuntla kavitha: కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి: ఎమ్మెల్సీ కవిత ధ్వజం  కల్వకుంట్ల కవిత
    KTR: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. సెగ్మెంట్ల వారీగా కేటీఆర్ సమీక్ష కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    Traffic Challans: పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్‌లపై 90శాతం వరకు తగ్గింపు.. నేటి నుంచి చెల్లించుకోవచ్చు  హైదరాబాద్
    RTC: పురుషులకు ప్రత్యేక బస్సులు.. సీనియర్ సిటిజన్లకే మొదటి ప్రాధాన్యం  టీఎస్ఆర్టీసీ

    టీఎస్పీఎస్సీ

    గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    టీఎస్‌పీఎస్సీ లీకేజీలో మరో ముగ్గురు అరెస్ట్‌.. 99కి పెరిగిన లిస్ట్  తెలంగాణ
    తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు తాజా వార్తలు
    గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పిఎస్‌సీ అప్పీల్ హైకోర్టు

    తాజా వార్తలు

    Himachal Pradesh: కళ్లముందే కూలిపోయిన 5 అంతస్తుల భవనం.. వీడియో వైరల్  హిమాచల్ ప్రదేశ్
    Amit Shah: భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం: అమిత్ షా  అమిత్ షా
    ECI: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రూ.10వేల కోట్లు అవసరం అవుతాయ్: ఎన్నికల సంఘం  జమిలి ఎన్నికలు
    Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెరిగాయ్.. ఈ మోడల్‌పై ఏకంగా రూ. 50వేలు..  మారుతి సుజుకీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025