
Mallareddy: ఆ భూమితో నాకు సంబంధం లేదు.. స్పందించిన మాజీ మంత్రి మాల్లారెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Mallareddy) స్పందించారు.
భూకబ్జాలపై తనకు ఎటువంటి సంబంధ లేదని, తనకు భూ కబ్జా చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ సమీపంలోని మూడు చింతలపల్లి కేశవరం భూకబ్జా ఆరోపణల విషయంలో మల్లారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
భూ కబ్జా చేచసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని, గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఇప్పటికీ దీనిపై కేసు నమోదైన విషయం వాస్తవమేనని, తాను కోర్టును ఆశ్రయిస్తానని మల్లారెడ్డి తెలిపారు.
Details
మాజీ మంత్రి మల్లారెడ్డితో అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
చింతపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35 లో ఉన్న 47 ఎకరాల ఎస్టీ వారసత్వ భూమిని మల్లారెడ్డి, అతని బినామీలు కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీనిపై శామీర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.