Page Loader
Uke Abbayya: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Uke Abbayya: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2024
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఊకే అబ్బయ్య రాజకీయ జీవితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో సీపీఐతో ప్రారంభమైంది. 1983లో బూర్గంపాడు నియోజకవర్గం నుంచి, 1994, 2009లో ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Details

ఇల్లందులో విషాధచాయలు

ఆయన ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఇల్లందు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక ఊకే అబ్బయ్య మృతితో ఇల్లందు నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.