Page Loader
KTR: ఫార్ములా ఈ రేస్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
ఫార్ములా ఈ రేస్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్

KTR: ఫార్ములా ఈ రేస్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2025
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. రేపు ఈడీ కూడా కేటీఆర్‌ను విచారించనుంది. ఈ కేసులో ఏసీబీ, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయి. ఉదయం 10 గంటలకు విచారణకు హజరు కానున్నారు. విదేశీ సంస్థలకు నిధుల మళ్లింపుపై ప్రశ్నించేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఈ దర్యాప్తులో కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.45.71 కోట్ల చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలొచ్చాయి.

Details

ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకు నిధులు బదిలీ

ఆర్ బి ఐ అనుమతి లేకుండానే ఈ నిధులను విదేశీ సంస్థలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీంతో కేటీఆర్‌తో పాటు బీఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌లకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ విచారణ అనంతరం వీరిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసులో నోటీసులు అందుకున్న హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. గడువు కోరుతూ వారు ఈమెయిల్ ద్వారా అభ్యర్థన పంపారు. ఈ నేపథ్యంలో వారి విచారణ తాత్కాలికంగా వాయిదా వేసి, ఈడీ కొత్త తేదీలతో నోటీసులు జారీ చేసింది.

Details

నోటీసులు జారీ చేసిన ఈడీ

ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండా, అలాగే ఆర్బీఐ అనుమతి పొందకుండా నిధులు మళ్లించారనే ఆరోపణలతో కేటీఆర్, హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 7న విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ఏసీబీ కూడా నోటీసులు జారీ చేయడంతో, ఫార్ములా ఈ రేస్ కేసుపై ఉత్కంఠ మరింత పెరిగింది.