తదుపరి వార్తా కథనం
Telangana Govt: ఫార్ములా ఈ రేస్ వివాదం.. లావాదేవీలను బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 06, 2025
01:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఫార్ములా ఈ-రేస్ వివాదంలో తెలంగాణ ప్రభుత్వం కీలక విషయాలను బయటపెట్టింది.
రేస్ నిర్వహించిన గ్రీన్‌కో సంస్థ ద్వారా బీఆర్ఎస్‌కు కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు ప్రకటించింది.
ఎన్నికల బాండ్ల ద్వారా బీఆర్ఎస్‌కు రూ.41 కోట్లు చెల్లించినట్లు వివరించింది. గ్రీన్‌కో, దాని అనుబంధ సంస్థలు మొత్తం 26 సార్లు బాండ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ లావాదేవీలు 2022 ఏప్రిల్ 8 నుండి అక్టోబర్ 10 వరకు జరిగినట్లు పేర్కొంది.
Details
మరోసారి కేటీఆర్‌కు నోటీసులిచ్చే అవకాశం
ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు విచారణకు హాజరయ్యారు.
అయితే తనతో పాటు న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతో కేటీఆర్ అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు.