Page Loader
#NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది?
ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది?

#NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2025
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజకీయ లాభాల కోసం ఎన్నికల ముందు ఉచిత పథకాలను ప్రకటించడం భారతదేశంలో సాధారణమైపోయింది. ఇది మొదట దిల్లీ రాజకీయాల్లో కనిపించినా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. వాస్తవానికి దేశ రాజధాని దిల్లీ తలసరి ఆదాయ పరంగా దేశంలో మూడవ స్థానంలో ఉంది. ఇది గోవా తర్వాత అత్యధిక స్థాయిలో ఉంది. అలాగే నిరుద్యోగం కూడా అత్యల్ప స్థాయిలో ఉంది. ఈ వాస్తవాలు ఢిల్లీలో ప్రజలకు ఉచితాలు అవసరమా అన్న ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ఆర్థికవేత్తలు, న్యాయ నిపుణుల అభిప్రాయాలను పరిశీలిస్తే, ఉచితాల వల్ల పొందే ప్రయోజనాలు, దాని రాజకీయ ప్రభావం ఎవరిపై ఉంటాయో నిర్దేశిస్తున్నారు.

Details

నిరుద్యోగంపై తీవ్ర ప్రభావం

దిల్లీ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ఎన్నికల సమయంలో ఇదే తరహాలో ఉచితాల ప్రకటనలు చేయడం మొదలుపెట్టాయి. ఇది సాధారణ ప్రజలపై ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పన్నుల భారం, నిరుద్యోగం వంటి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి వర్గం ఈ పరిస్థితుల్లో అధిక ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ఆ వర్గంలోని ఎగువ, మధ్య, దిగువ స్థాయిలు కూడా ఉచితాల ప్రభావానికి లోనవుతున్నాయి. కానీ ఇవి వాస్తవంగా అవసరమా లేదా అనేది చర్చనీయాంశమైంది.

Details

దిల్లీ తలసరి ఆదాయం రూ. 4,61,910

ఆర్థికవేత్తలు డాక్టర్ దీపాంషు గోయల్, వేద్ జైన్, రవి సింగ్ వంటి వారు ఉచితాలకు చట్టపరమైన నిర్వచనాన్ని నిర్ధారించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నారు. దిల్లీ తలసరి ఆదాయం రూ. 4,61,910 ఉండగా, జాతీయ తలసరి ఆదాయం రూ. 1,84,205 మాత్రమే. దీంతో దిల్లీ అభివృద్ధి ఉన్నా రాజకీయ పార్టీలు ఉచితాలను వ్యూహంగా ఉపయోగించడం ప్రశ్నార్థకంగా మారింది. నిరుద్యోగ రేటు కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువగా ఉంది.

Details

సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి

అదే సమయంలో రాజకీయ పార్టీలు ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం, వాస్తవ సమస్యల పరిష్కారానికి బదులుగా ఉచిత పథకాలకు పరిమితి కావడం పెద్ద సమస్యగా మారుతోంది. సుప్రీంకోర్టు దీనిపై తీసుకొచ్చే తీర్పు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు, ఈ సమస్యకు పరిష్కారం చూపుతాయనే నమ్మకం ఉంది. కానీ ప్రజలు వాస్తవ సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటూ, రాజకీయ పార్టీలు వాటిని ఉచితాల జోలికి పోల్చకుండా సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆశిస్తున్నారు.