LOADING...
Petrol,Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పెంచిన ధరలు తక్షణం అమలులోకి 
పెంచిన ధరలు తక్షణం అమలులోకి

Petrol,Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పెంచిన ధరలు తక్షణం అమలులోకి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 మేర ధరలను పెంచాయి. కొత్త ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే మూడు దఫాలుగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా పెంపు సామాన్యులపై మరింత భారం మోపనుంది. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.102.12కు చేరగా, డీజిల్‌ ధర రూ.95.20గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.111.21కు చేరింది. అక్కడ డీజిల్‌ ధర రూ.97.83గా ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.77కు చేరగా, డీజిల్‌ ధర రూ.99.55గా నమోదైంది.

వివరాలు 

తెలుగు రాష్ట్రాలు 

తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు మరింత పెరిగాయి. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.117.19గా ఉండగా, డీజిల్‌ ధర రూ.104.88కు చేరింది. గుంటూరులో పెట్రోల్‌ రూ.117.59, డీజిల్‌ రూ.105.28గా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.115.58కు చేరగా, డీజిల్‌ ధర రూ.103.74గా ఉంది.

Advertisement