LOADING...
Telangana: కాంగ్రెస్ కార్యాలయంలో చొక్కాలు పట్టుకుని నేతల ఘర్షణ.. కిందపడిన ఫిరోజ్‌ఖాన్
కాంగ్రెస్ కార్యాలయంలో చొక్కాలు పట్టుకుని నేతల ఘర్షణ.. కిందపడిన ఫిరోజ్‌ఖాన్

Telangana: కాంగ్రెస్ కార్యాలయంలో చొక్కాలు పట్టుకుని నేతల ఘర్షణ.. కిందపడిన ఫిరోజ్‌ఖాన్

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌లో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చొనే విషయంలో కాంగ్రెస్ నేతలు ఫిరోజ్‌ఖాన్‌, కార్వాన్ బాధ్యుడు ఉస్మాన్ అల్ హాజ్రీ మధ్య వివాదం చెలరేగింది. మొదట మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. అనంతరం ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చొక్కాలు పట్టుకునే వరకు పరిస్థితి చేరుకుంది. ఈ సందర్భంగా ఉస్మాన్ అల్ హాజ్రీ కోపంతో ఫిరోజ్‌ఖాన్‌ను తోసేయగా ఆయన కిందపడిపోయారు. సీనియర్ నేతల సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు.

వివరాలు 

అడ్డుకునే ప్రయత్నం చేసిన వీహెచ్

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆవేశంలో ఉన్న నేతలు ఆయనను కూడా పక్కకు నెట్టేందుకు యత్నించారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అనంతరం ఇతర కాంగ్రెస్ నాయకులు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఇరువర్గాలను విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫిరోజ్‌ఖాన్‌, కార్వాన్‌ ఇన్ ఛార్జ్ ఉస్మాన్‌ ఆల్‌ హాజ్రీల మధ్య గొడవ

Advertisement