Loading...
PM Modi: గాంధీ జయంతి సందర్భంగా మోదీ నివాళులు.. స్వదేశీ వస్తువులు వాడాలని పిలుపు
గాంధీ జయంతి సందర్భంగా మోదీ నివాళులు.. స్వదేశీ వస్తువులు వాడాలని పిలుపు

PM Modi: గాంధీ జయంతి సందర్భంగా మోదీ నివాళులు.. స్వదేశీ వస్తువులు వాడాలని పిలుపు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

మహాత్మాగాంధీ ఆశయాలు ఎప్పటికీ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సత్యం, అహింస, కరుణ, సేవ, నిరాడంబరత, స్వదేశీ భావనలకు బాపూజీ జీవితం ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన మార్గంలో ముందుకు సాగుతూ మెరుగైన సమాజంతో పాటు వికసిత భారత్‌ను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం మహాత్ముడికి నివాళులర్పించిన ప్రధాని.. ఆయన బోధనలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా 'ఎక్స్‌' వేదికగా మోదీ స్పందించారు. బాపూజీ శాశ్వత సందేశం మెరుగైన సమాజం,వికసిత భారత్‌ నిర్మాణానికి నిరంతరం దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షించారు. గాంధీజీ జీవితం సత్యం, అహింస, కరుణ, సేవలకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. కాలం మారినా ఆయన ఆలోచనలు, జీవితం మానవాళికి స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

వివరాలు 

స్వదేశీకి ప్రాధాన్యం..

వీడియో సందేశంలోనూ గాంధీజీ గొప్పతనాన్ని ప్రధాని వివరించారు.

అక్టోబరు 2వ తేదీ ప్రాధాన్యం దేశంలోని ప్రతి చిన్నారికీ తెలుసని అన్నారు.

అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ కోట్లాది మంది ప్రజల హృదయాల్లో గాంధీజీ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

మానవాళిపై ఆయన సిద్ధాంతాల ప్రభావం కొనసాగుతున్నంత కాలం బాపూజీ ఆశయాలు ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు.

గాంధీజీ స్వదేశీ భావనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని మోదీ గుర్తుచేశారు.

స్వదేశీ ఆలోచనకు ఖాదీ ప్రధాన ప్రతీకగా నిలిచిందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని కోరారు.

దేశీయంగా తయారైన వస్తువులను గర్వంగా వినియోగించాలని పిలుపునిచ్చారు.

ADVERTISEMENT

వివరాలు 

లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళులు..

దేశ రెండో ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనను కూడా నరేంద్ర మోదీ స్మరించుకున్నారు.

శాస్త్రి నిరాడంబరత, దేశం పట్ల ఆయనకున్న అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని 'ఎక్స్‌' వేదికగా పేర్కొన్నారు.

న్యూఢిల్లీలోని విజయ్‌ఘాట్‌ వద్ద శాస్త్రి సమాధికి నివాళులర్పించారు. 'జై జవాన్‌.. జై కిసాన్‌' నినాదంతో సైనికులు, రైతుల్లో కొత్త స్ఫూర్తిని నింపిన గొప్ప నాయకుడు లాల్‌ బహదూర్‌ శాస్త్రి అని మోదీ కొనియాడారు.

బయటకు ఎంతో సాధారణంగా, నిరాడంబరంగా కనిపించినా.. సంకల్పంలో మాత్రం ఆయన రాతిలా దృఢంగా ఉండేవారని గుర్తుచేశారు.

రైతులు, సైనికుల సహకారంతో దేశం విజయాలు సాధించేలా శాస్త్రి చూపిన మార్గం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్

ADVERTISEMENT