Gangrape: తమిళనాడులో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. దిండిగల్ జిల్లా థేనిలో ఓ నర్సింగ్ విద్యార్థిని దుండగుల ఎత్తుకెళ్లి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. కాలేజీ సమీపంలో నుండి అపహరించిన యువతిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం అపస్మారక స్థితిలో ఆమెను దిండిగల్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్డుపై పడేశారు.
నిందితుల కోసం గాలింపు చర్యలు
ఈ దృశ్యం చూసిన స్థానికులు హుటాహుటిన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ దారుణానికి సంబంధించిన నేరస్తుల జాడ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.