తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Train ticket refund: రైలు రద్దు అయితే 3 రోజుల్లోనే టికెట్ రిఫండ్ పొందండి
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Mar 18, 2025 
                    
                     09:52 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
రద్దయిన రైలు టికెట్ల డబ్బును తిరిగి పొందేందుకు ప్రయాణికులు మూడు రోజుల్లోగా వాటిని సమర్పించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. ఈ-టికెట్లకు ఆటో రిఫండ్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఈ-టికెట్ల విషయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, డబ్బులు ఆటోమెటిక్‌గా బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కౌంటర్ టికెట్ల రిఫండ్ కౌంటర్‌లో బుక్ చేసుకున్న టికెట్లను మాత్రం రద్దైన ప్రయాణ తేదీ, సమయం నుంచి మూడు రోజుల్లోగా సమీపంలోని ఏదైనా రైల్వే స్టేషన్ కౌంటర్‌లో సమర్పించి రిఫండ్ పొందాలని సూచించారు.
Details
రైళ్లు రద్దయ్యే సందర్భాలు
సాంకేతిక సమస్యలు భారీ వర్షాలు బంద్‌లు వివిధ ప్రమాదాల కారణంగా రైళ్లు రద్దయ్యే పరిస్థితిలో రిజర్వేషన్ టికెట్లకు పై నిబంధనలు వర్తిస్తాయని ద.మ. రైల్వే స్పష్టం చేసింది.