Loading...
Godavari Pushkaralu: పుష్కరాల ఏర్పాట్లకు నిధుల మంజూరు.. భద్రతకు రూ.50 కోట్లు,ఘాట్లకు రూ.210 కోట్లు
పుష్కరాల ఏర్పాట్లకు నిధుల మంజూరు.. భద్రతకు రూ.50 కోట్లు,ఘాట్లకు రూ.210 కోట్లు

Godavari Pushkaralu: పుష్కరాల ఏర్పాట్లకు నిధుల మంజూరు.. భద్రతకు రూ.50 కోట్లు,ఘాట్లకు రూ.210 కోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్లను కేటాయించింది. పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ఈ నిధులతో డీబీఎంఎస్‌తో కూడిన ఏఐ జీపీయూ సర్వర్లు, ఏఐ అనలిటిక్స్‌ సర్వర్‌ క్లస్టర్లు, ఏఐ ఆధారిత ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. విపత్తు నిర్వహణకు అవసరమైన సాంకేతిక సదుపాయాలు, డిస్‌ప్లే బోర్డులు, ఏఐ ఎనేబుల్డ్‌ క్లౌడ్‌ పీటీజడ్‌ కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

వివరాలు 

ఏపీఎఫ్‌ఐఎస్‌ ఆధునికీకరణకు రూ.25 కోట్లు

అలాగే ఐపీ ఆధారిత పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, డి.కమ్యూనికేషన్‌ పరికరాలు, ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ బ్యారక్స్‌, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు.

పుష్కర ప్రాంతాల్లో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఈ నిధులను వినియోగిస్తారు.

ఈ మేరకు హోంశాఖ (బడ్జెట్‌) ముఖ్య కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) జి.విజయకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

దర్యాప్తు ప్రక్రియను మరింత శాస్త్రీయంగా, సాంకేతికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా అధునాతన ఏఐ, ఎన్‌ఎన్‌ (న్యూట్రల్‌ నెట్‌వర్క్స్‌) వంటి సాంకేతిక విధానాలను వినియోగించనున్నారు.

ఆటోమేటెడ్‌ పామ్‌ అండ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ (ఏపీఎఫ్‌ఐఎస్‌)ను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రూ.25 కోట్లను కేటాయించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు 

పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.210 కోట్లు

గోదావరి పుష్కరాల నేపథ్యంలో 238 ఘాట్ల నిర్మాణం,అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.210 కోట్లను మంజూరు చేసింది.

ఇప్పటికే ఉన్న ఘాట్ల అభివృద్ధితోపాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త ఘాట్ల నిర్మాణం, అనుబంధ పనులు చేపట్టనున్నారు.

ప్రభుత్వం తాజాగా రూ.210.06 కోట్లకు అనుమతి ఇచ్చినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల పరిధిలో ఈ పనులు చేపట్టనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.210 కోట్లు

పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఘాట్ల వద్ద అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది.

ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులతోపాటు అనుబంధ సదుపాయాలను కూడా ప్రణాళిక ప్రకారం చేపట్టనున్నారు.

ADVERTISEMENT