LOADING...
Telegana: నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్.. తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో మార్పులు
నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్.. తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో మార్పులు

Telegana: నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్.. తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో మార్పులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

'తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012'కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఈ మేరకు కొత్తగా జీవోను జారీ చేసింది. తాజా మార్పుల ప్రకారం, 21 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనాలను హైరైజ్ భవనాలుగా గుర్తించనున్నారు. అలాగే 750 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న స్థలాల్లో 18 నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలు నిర్మించాలంటే టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) వినియోగం తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, నాన్ హైరైజ్ భవనాల విషయంలో టీడీఆర్ వినియోగంతో సెట్‌బ్యాక్ నిబంధనల్లో సడలింపులు కల్పించింది.

details

ప్రయోజనాలతో పాటు కొన్ని సమస్యలు

ఇప్పటి వరకు 2012లో జారీ చేసిన నిబంధనలే అమల్లో ఉన్నాయి. కాలానుగుణంగా వాటిలో కొన్ని మార్పులు చేసినప్పటికీ, వాటి వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని ప్రణాళిక విభాగం అభిప్రాయపడింది. ఇదే సమయంలో, కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2016లో నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజా సవరణలను అమలు చేసింది.

Advertisement